జీవము గలవాడు నా దేవుడు జీవించుచున్నవాడు
గుడ్డివాడు కాదు నా దేవుడు నా దేవుడు నా క్రియలను చూచును
చెవిటి వాడు కాదు నా దేవుడు నా మోర వినుచుండును !! జీవము !!
మూగవాడు కాదు నా దేవుడు నాతో మాట్లాడును
కురుచకాదు మరి ఆయన హస్తము నన్నిలా రక్షించును !! జీవము !!
మనుషులు చేసిన మట్టి విగ్రహం కాదు నా దేవుడు
ఆత్మా రూపిగా మాతో ఉండి మమ్మును కాపాడును !! జీవము !!